News

కేసీఆర్‌పై వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ ఫిర్యాదు

509views

భాగ్య‌న‌గ‌రం: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్ దళ్ నేతలు సుల్తాన్ బజార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దేవి దేవతలను కించపరుస్తూ సీఎం కేసీఆర్ మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కేసీఆర్‌పై వెంటనే కేసు నమోదు చేయాలని భజరంగ్ దళ్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ డిమాండ్ చేశారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో ఉన్న ప్రముఖ దేవతలను కీర్తించారని, దీనిని రాజకీయంగా తప్పు పడుతూ ఈ నెల ప‌దోతేదీన‌ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ హిందూ దేవతలను కించపరిచేలా వ్యాఖ్యానించారని వీహెచ్‌పీ పేర్కొంది.

జోగులాంబ అమ్మవారిని కించపరిచే విధంగా చేసిన వాఖ్యలను ఖండిస్తూ, హిందు దేవతపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, శక్తి పీఠం జోగులాంబ అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే హిందువులు సహించరని వారు స్పష్టం చేశారు. రాజకీయాలు చేసుకోండి.. హిందు దేవతలను కించపరిస్తే సహించమని హెచ్చరించారు.

గతంలో హిందుగాళ్ళు, బొందు గాళ్ళు అంటూ హిందువులను కించపరిచారని చెబుతూ కేసీఆర్‌పై అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నట్టు వెల్లడించారు. హిందూ దైవాన్ని కించపరిచిన కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని హైకోర్టును ఆశ్రయిస్తామని పండరీనాథ్ తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి