News

బూస్టర్ డోస్.. ఉచితం

483views

న్యూఢిల్లీ: ప్రత్యేక డ్రైవ్‌ కింద ప్రభుత్వ కేంద్రాల్లో పెద్దలందరూ ఈ నెల 15 నుంచి వచ్చే 75 రోజుల పాటు ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్ బూస్టర్‌ డోస్‌లను పొందవచ్చని అధికారులు బుధవారం తెలిపారు. థర్డ్ డోస్ కవరేజీని మెరుగుపరిచే లక్ష్యంతో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా ఈ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు 18-59 మధ్య వయస్సు గల 77 కోట్ల జనాభాలో 1 శాతం కంటే తక్కువ మంది బూస్టర్ డోస్‌ను వేయించుకున్నారు.

18 నుంచి 59 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు క‌లిగిన వారంద‌రికీ ఉచితంగా బూస్ట‌ర్ డోస్‌ను అందించ‌నున్నారు. అర్హులైన వారు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ బూస్టర్‌ డోసును పొందవచ్చని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్న‌ట్టు మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి