
446views
హర్యానా: ఉదయపూర్‌లో రక్షణ లేని హిందూ కన్హయ్య లాల్‌ను ఇద్దరు ఇస్లామిస్టులు తల నరికి చంపిన ఘటనను దేశం ఇంకా మరిచిపోకముందే దాదాపు అటువంటి సంఘటనే మరొటి చోటుచేసుకుంది.
హర్యానాలోని పల్వాల్ జిల్లాలో హిందువు విక్కీ భరద్వాజ్‌పై ముస్లింలు పదునైన ఆయుధంతో దాడి చేశారు. జూన్ 28, మంగళవారం విక్కీ ఢిల్లీ నుండి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. పాల్వాల్‌లోని గోలయా పబ్లిక్ స్కూల్ సమీపంలో నిందితులు అతనిపై దాడి చేశారు. ఈ దుండగులు విక్కీని కత్తితో పొడిచి అతని ఛాతీని చీల్చారు. బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
దాడి చేసిన వారిని బిలాల్, అంజుమ్‌గా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగినప్పటి నుంచి నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. పోలీసుల ప్రకారం, అంజుమ్, బిలాల్‌తో పాటు మరో 5-6 మంది ఉన్నారు.
Source: HINDU POST





