News

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు!

419views
  • ఎక్కడికక్కడ నిలచిపోయిన కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రికులు

ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బదరీనాథ్-కేదార్‌నాథ్ హైవేపై రాళ్ళు, మట్టి పడటం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైవేపై కార్లు, లారీలు భారీగా నిలిచిపోయాయి. దీంతో యాత్రికులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో ఇబ్బందిపడినవారికి ఈ వాతావరణం ఆహ్లాదకరంగా కనిపిస్తోంది.

న్యూఢిల్లీలోని తూర్పు కైలాష్, బురారి, షహ్‌దరా, పట్పర్‌గంజ్, ఐటీఓ క్రాసింగ్, ఇండియా గేట్, బారాపుల్లా, రింగ్ రోడ్డు, ఢిల్లీ-నోయిడా బోర్డర్, ఢిల్లీ-గురుగ్రామ్ రోడ్లు ప్రాంతాల్లో గురువారం ఉదయం వర్షం కురిసింది. ఉష్ణోగ్రత 27.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ జామ్‌లు ప్రజలను ఇబ్బంది పెట్టాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి