News

దేశంలోని ప్రతి గ్రామానికి హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు

428views
  • బాష్ ఇండియా స్మార్ట్ క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి గ్రామానికీ హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందజేయడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. డిజిటల్, టెక్నాలజీ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ పిలుపునిచ్చారు. బాష్ ఇండియా స్మార్ట్ కేంపస్‌ను మోదీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇది టెక్నాలజీ శకమని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో టెక్నాలజీ వల్ల కలిగిన ప్రయోజనాలను ప్రస్తావించారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు రావాలన్నారు. ఈ రంగాల్లో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యమని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి