
475views
-
11 కోట్ల మంది దాతలు, రామతీర్థ ట్రస్ట్ వెల్లడి
అయోధ్య: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఇప్పటివరకు రూ.3,400 కోట్లు విరాళంగా వచ్చినట్టు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. ఇప్పటి వరకు 11 కోట్ల మంది దాతలు ఈ విరాళాలు ఇచ్చినట్టు ప్రకటించింది. కనిష్ఠంగా రూ. 10 నుంచి గరిష్ఠంగా కోటి రూపాయల వరకు విరాళాలు ఇచ్చారని వెల్లడించింది.
చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ రామాలయం నిర్మాణంలో భాగస్వాములుగా మారారని ట్రస్ట్ తెలిపింది. 2024 జనవరి నాటికి ఆలయ గర్భగుడి సిద్ధమవుతుందని వెల్లడించింది. 2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మందిరం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉండనుంది. మూడు అంతస్తులతో నిర్మించనున్న ఈ మందిరం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. రెండున్నర అడుగుల పొడవు ఉన్న 17 వేల రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు.





