
361views
నంద్యాల: నంద్యాల జిల్లా, స్థానిక సంఘమిత్ర సేవాసమితి ఆధ్వర్యంలో ఇటీవల ఐ.ఎం.ఎ ఉమెన్ డాక్టర్స్ వింగ్ నల్లమల అడవుల్లో శివపురం, యర్రకుంట తదితర చెంచుగూడాలలోని చెంచు మహిళలకు వైద్య సేవలు అందించింది. అవసరమైన వారికి వైద్యులు నర్మద, మాధవి, హరిత, క్రిష్ణవేణి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ శిబిరంలో సుమారు 150 మంది చెంచులు వైద్య సేవలు పొందారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర , కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్,శ్రీ వాసుదేవ రెడ్డి, సంఘమిత్ర, గోకవరం ఆవాస ప్రముఖులు శ్రీ గంగాధర్, శ్రీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.







