News

టైల‌ర్ క‌న్హ‌య్య హంత‌కుల‌ను చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్న పోలీసులు!

412views

ఉద‌య్‌పూర్‌: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలల్‌ కన్హయ్య లాల్‌ను మంగళవారం నరికి చంపిన ఇద్దరు హంతకులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కన్హయ్య హత్య అనంతరం బైక్‌పై నగరం నుంచి పారిపోతున్న గౌస్ మహ్మద్, రియాజ్ అక్తరీని ఉదయ్‌పూర్‌ శివారులోని హైవేపై పోలీసులు అడ్డుకున్నారు.

రహదారిపై బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు ఇద్దరు హంతకులను చుట్టుముట్టి వారిని నిరాయుధులను చేశారు. ఆపై అదుపులోకి తీసుకుని పోలీస్‌ వాహనంలో స్టేషన్‌కు తరలించి అరెస్ట్‌ చేశారు. కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ నితిన్‌ అగర్వాల్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఉదయపూర్ టైలర్‌ను ఊచకోత కోసిన హంతకులిద్దరినీ రాజస్థాన్ పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్ పోలీసులు సంఘటనా స్థలంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చేయాల్సింది ఇంకా ఉంది. ఇది కాంగ్రెస్ పాలిత రాజస్థాన్. సంఘ వ్యతిరేకులను అస్సలు సహించదు’ అని అందులో పేర్కొన్నారు.

హంతకులకు పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉండవచ్చని అనుమానిస్తున్నది. మరోవైపు మృతుడు కన్హయ్య కుటుంబానికి రూ.31 లక్షల పరిహారంతోపాటు ఇద్దరు కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని రాజస్థాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఉదయ్‌పూర్‌లో పరిస్థితి అదుపులో ఉన్నట్టు వెల్లడించింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి