
369views
న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ పర్సనల్ సెక్రటరీపై అత్యాచార కేసు నమోదైంది. సోనియా గాంధీ పర్సనల్ సెక్రటరీ పీపీ మాధవన్‌పై ఢిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం వచ్చిన మహిళను 71 ఏళ్ళ వృద్ధుడైన పీపీ మాధవన్‌తో పరిచయం ఏర్పడిందని, ఆ సమయంలో అతను తనని రెండుసార్లు బలవంతం చేశాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.





