News

భార‌త్‌లోని ప్రధాన నగరాల్లో హై అలెర్ట్!

451views
  • ఉగ్ర‌దాడుల‌కు పాకిస్తాన్ ముష్కర మూకల యత్నం

  • గుర్తించిన భారత నిఘా వర్గాలు

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌​కు చెందిన ముష్కర ముఠాలు భారత్​పై దాడులకు కుట్రలు పన్నుతున్నాయి. మతపరమైన స్థలాలపై, భద్రతా దళాలపై దాడులు చేపట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. అల్​ఖైదా ఇండియన్ సబ్​కాంటినెంట్ (ఏక్యూఐఎస్) విభాగం భారీ దాడులకు ప్రయత్నిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. అమర్​నాథ్ యాత్రికులు, వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళే భక్తులే లక్ష్యంగా దాడులకు యత్నించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా వివిధ సెక్యూరిటీ విభాగాలకు హెచ్చరికలు జారీ చేసింది. మతపరమైన ప్రదేశాల వద్ద అదనపు భద్రత కల్పించాలని, పర్యవేక్షణ పెంచాలని స్పష్టం చేసింది. భారతదేశ భద్రతకు విఘాతం కలిగించే చర్యలన్నింటినీ భగ్నం చేయాలని సూచించింది.

హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది తాలిబ్ హుస్సేన్ గుజ్జర్​ నుంచి సేకరించిన సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు చేశాయి. ఈ నెల ప్రారంభంలో కిష్టావర్ జిల్లాలో ఆర్మీ, కశ్మీర్​ పోలీసులు కలిసి.. గుజ్జర్​ను అరెస్టు చేశారు. జమ్ము కశ్మీర్​లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులను చేర్చుకునేందుకు గుజ్జర్ ప్రయత్నిస్తున్నట్టు ఓ ఇంటెలిజెన్స్ అధికారి చెప్పారు. ఈ నేపథ్యంలోనే జమ్ము కశ్మీర్​లో గతవారం ఎన్​ఐఏ భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించింది. 14 ప్రాంతాల్లో సోదాలు చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి