
449views
కోడూరు: లేగదూడ మరణంతో ఓ గోమాత మూగ రోదన మాతృ ప్రేమకు అద్దంపట్టింది. లారీ ఢీకొని ఆవు దూడ చనిపోయింది. ఇది చూసి తల్లడిల్లిన తల్లి ఆవు రోదించింది. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. కృష్ణాజిల్లా కోడూరు విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దూడ మరణాన్ని జీర్ణించుకోలేని ఆ గోమాత.. గంటల తరబడి అక్కడే కూర్చుని లేగదూడను నిమురుతూ ఉండిపోయింది. గోమాత బాధను చూడలేని స్థానికులు చనిపోయిన దూడను అక్కడి నుంచి తీసుకెళ్ళారు. ఆ తర్వాత గోవు మరింత విషణ్న వదనంతో కనిపించింది. రాత్రి వరకూ రహదారుల వెంట అరుస్తూనే తిరిగింది.
Source: EtvBharat





