
403views
భాగ్యనగరం: ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ యూపీ ఉప ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితంతో బీజేపీని ఓడించే దమ్ము సమాజ్‌వాదీ పార్టీకి లేదని స్పష్టం అవుతోందని అన్నారు. యూపీ ఉప ఎన్నికల ఫలితాలు.. సమాజ్‌వాదీ పార్టీకి బీజేపీని ఓడించే దమ్ము లేదని నిరూపించాయి. అసలు ఆ పార్టీకి అంత మేధో నిజాయితీ లేదని తేలింది. ఇలాంటి అసమర్థ పార్టీలకు దయ చేసి మైనారిటీలు ఓట్లు వేయకండి అని ఒవైసీ పిలుపు ఇచ్చారు. ‘‘బీజేపీ గెలుపునకు బాధ్యులెవరో.. ఇప్పుడు ఎవరికి బీజేపీ బి-టీమ్, సి-టీమ్ అని పేరు పెడతారో’’ అంటూ అఖిలేష్ యాదవ్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు ఒవైసీ. అంతేకాదు రాంపూర్, ఆజాంఘడ్ ఉప ఎన్నికల్లో ఓటమికి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌నే బాధ్యుడిగా విమర్శించారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.





