
421views
సికింద్రాబాద్ : బోనాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జులై 17వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద వివిధ శాఖల అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. బాటా నుంచి రాంగోపాల్ పేట ఓల్డ్ పోలీసు స్టేషన్ వరకు చేపట్టిన వీడీసీసీ రోడ్డు నిర్మాణం..ఆలయ పరిసరాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మంత్రి తలసాని సమీక్షించారు. రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టంచేశారు. ఉత్సవాలు ప్రారంభం అయ్యే వరకు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు.





