News

పాతబస్తీలో జర్నలిస్టుపై ఎమ్మెల్యే ఖాన్ డ్రైవర్ దాడి!

485views

భాగ్య‌న‌గ‌రం: పాతబస్తీలో ఎంఐఎం పార్టీ అండతో అక్కడి వారు ప్రభుత్వ అధికారులను, పోలీసులను ఎదిరించడం.. వారిపై దాడులకు దిగడం మనం గతంలో చూశాం. అలాగే ఆ ప్రాంతంలో నివసించే ఓ వర్గం ఆధిపత్యమే అక్కడ చెల్లుతుంది. అక్కడ నివసించాలంటే వారు చెప్పిన విధంగా ఉంటేనే సాధ్యం అవుతుంది. ప్రభుత్వమైనా, ఇతర ప్రజలైనా వారి చెప్పు చేతుల్లో ఉండాల్సిందే. అయితే, తాజాగా జరిగిన ఓ ఘటన అక్కడి పరిస్థితిని మరోసారి వెలుగులోకి తెచ్చింది.

హెచ్ఎస్ న్యూస్ ఛానల్‌లో వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్న అహ్మద్ అలీ వాళ్ళ‌ ప్రాంతంలో నీటి సరఫరా లేకపోవడంతో వీడియో తీసి ఛానల్ ప్రసారం చేశాడు. అలాగే అదే విషయాన్ని చార్మినార్ ఎమ్మెల్యే ముంతాబ్ అహ్మద్ ఖాన్ దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేశాడు. తన తండ్రితో కలిసి ఎమ్మెల్యేను కలవడానికి వెళ్ళిన మహ్మద్ అలీపై ఎమ్మెల్యే డ్రైవర్ దాడికి దిగాడు. అడ్డుకున్న మహ్మద్ అలీ తండ్రిపై కూడా తీవ్రంగా దాడికి దిగాడు. డ్రైవర్ జాఫర్ దాడిలో జర్నలిస్టు, అతని తండ్రి తీవ్రంగా గాయపడ్డారు.

ఆ గాయాలతోనే వారికి జరిగిన అన్యాయాన్ని వీడియోలో వెల్లడించారు. వీడియోలో, అతని తండ్రి ముఖమంతా రక్తంతో అతని పక్కన నిలబడి ఉన్న దృశ్యాన్ని కూడా చూడవచ్చు. అది మ్యాగజైన్ ఆర్గనైజర్ వీక్లీ ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఈ పోస్టుతో విషయం తెలుగులోకి వచ్చింది. ఎంఐఎం పార్టీ పేద ముస్లింల కోసమే పని చేస్తుందని చెప్పుకునే అసదుద్దీన్ ఓవైసీ ఈ దాడిపై ఎలా స్పందిస్తారంటూ బాధితుడు వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి