
-
కాన్పూర్ హింసకు నిధులు అందజేత
-
రామ్ జానకి దేవాలయం భూమిలో హోటల్ అక్రమ నిర్మాణం
లక్నో: కాన్పూర్ హింసకు బాబా బిర్యానీ హౌస్ యజమాని ముఖ్తార్ బాబా నిధులు సమకూర్చినందుకు, హింసను ప్రేరేపించినందుకు పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా, బాబా తన హోటల్‌ను రామ్ జానకి ఆలయానికి చెందిన స్థలంలో అక్రమంగా నిర్మించాడని వెల్లడైంది.
బుల్‌డోజర్‌కు భయపడి…
తన రెస్టారెంట్‌ను బుల్‌డోజర్‌తో ధ్వంసం చేస్తే ఆ ప్రాంతంలో హింస చెలరేగుతుందని సందేశం పంపాలనుకున్నాడు. కాన్పూర్ హింసాకాండలో ప్రధాన నిందితుడు హయత్ జాఫర్ హష్మీకి బాబా డబ్బు ఇచ్చినట్టు సమాచారం. రామ్ జానకి గుడి భూమిని ఓ పాకిస్తానీ… బాబాకు విక్రయించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. జిల్లా మేజిస్ట్రేట్ (DM)గా ఉన్న సమయంలో, విశాఖ్ జి అయ్యర్ ఒక సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ విషయంపై దర్యాప్తు చేయాలని అప్పటి సదర్ SDM అనురాజ్ జైన్‌ను ఆదేశించారు.
బెకాన్‌గంజ్‌లోని డాక్టర్ బెరి క్రాస్‌రోడ్‌లో అబిద్ రెహమాన్ అనే వ్యక్తికి ఇల్లు (99/14) ఉందని పరిశోధనల్లో వెల్లడైంది. ఇతను తన నివాసానికి పక్కనే ఉన్న రామజానకీ మందిర భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నాడు. 1982లో, రెహమాన్ తన 99/14 ఆస్తిని 99/14-Aకి మార్చాడు. తర్వాత తన ఇంటితో పాటు ఆలయాన్ని ముఖ్తార్ బాబాకు విక్రయించాడు.
ముఖ్తార్, తన తల్లి పేరు మీద బహుమతి (హెబనామా) దస్తావేజును పొందాడు. తదనంతరం ఆస్తిని తన పేరు మీదకి మార్చుకున్నాడు. ఆలయం వెలుపల ఉన్న 18 హిందూ స్టాల్స్‌ను ఒకదాని తర్వాత ఒకటిగా తొలగించి, ఆక్రమణకు గురైన ఆలయ భూమిలో 400 చదరపు గజాలలో బాబా బిర్యానీ రెస్టారెంట్‌ను నిర్మించాడు.
ఆ రెస్టారెంట్‌లో ఇప్పటికీ ఆలయ గుర్తులు, చిహ్నాలు ఉన్నాయని జిల్లా యంత్రాంగం జరిపిన విచారణలో నిర్ధారించారు. విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ముఖ్తార్ బాబాకు షోకజ్ నోటీసు పంపారు. బిర్యానీ హౌస్‌ను ఎప్పుడైనా బుల్‌డోజర్‌తో కూల్చివేయవచ్చని బాబా తెలుసుకొన్నాడు.
ఈ నేపథ్యంలోనే బాబా హష్మీతో సహా అనేక మంది నిందితులకు నిధులు సమకూర్చాడు. ఇంకా, ప్రభుత్వానికి ‘సందేశం’ పంపడానికి ఆ ప్రాంతంలో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నించాడు. ఒకవేళ అధికారులు తన రెస్టారెంట్‌ను బుల్‌డోజ్‌తో కూల్చివేస్తే ఆ ప్రాంతంలో ఎప్పుడైనా హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని పరిపాలనాధికారులు తెలుసుకొనే చేశాడు. అయితే, బాబా దుష్ట ప్రణాళికలను ఛేదించడంలో పోలీసులు విజయం సాధించారు. పోలీసులు అతడికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించి అదుపులోకి తీసుకున్నారు. హింసను ప్రేరేపించేందుకు నిందితులు ఎంత మొత్తంలో నిధులు వెచ్చించారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అక్కడ ఆలయం ఉన్నమాట వాస్తవమే…
నగర కార్పొరేషన్ పంచశాల రిజిస్ట్రీ ఈ ఆలయాన్ని రామ్ జానకి టెంపుల్ ట్రస్ట్ మేనేజర్‌గా ఉన్న భగవందీన్ నిర్వహించినట్టు చూపిస్తుంది. రిజిస్ట్రీ ప్రకారం, భగవాన్దీన్ 1927 నుండి 1953 వరకు ట్రస్ట్ వ్యవహారాలను నిర్వహించాడు. ట్రస్ట్ కింద 18 స్టాల్స్ ఉన్నాయి, అవి ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఈ స్టాల్స్‌ను హిందువులు నడిపేవారు.
అమ్మకందారులు పూజ సామగ్రి, నగలు, రెడీమేడ్ బట్టలు, ప్రసాదం మొదలైన వివిధ వస్తువులను విక్రయించేవారు. రిజిస్టర్‌లో 1927 నుండి 1938 వరకు 18 మంది విక్రేతల పేర్లు ఉన్నాయి. మన్నా, నాథు, రాంభరోస్, గజ్జు, నాథ, సత్నారాయణ, భన్సిధర్, మహాదేవ్, బసేసర్ , మిశ్రా, చేద్దా, విశ్వనాథ్, అజోధ్య, కేశవ్, సుఖ్లేన్, ధర్మం, మఖత్. బాబా ఈ హిందువులను సైట్ నుండి దౌర్జన్యంగా తొలగించగలిగాడు. అయినప్పటికీ, పత్రాలు ఇప్పటికీ వారి పేర్ల మీదే ఉన్నాయి.
Source: HINDU POST





