
-
మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో వివాదాస్పద ప్రశ్న
-
రేగిన తీవ్ర దుమారం… సంబంధిత అధికారిపై చర్యలు
భోపాల్: ‘కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించే నిర్ణయం తీసుకోవాలా?’ అంటూ మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అడిగిన ఒక ప్రశ్న తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ నెల 19న నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించి మల్లిపుల్ చాయిస్‌గా అడిగిన ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపివేస్తుంది. నెటిజెన్లు ఎంపీపీఎస్‌సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ”భారత్ యొక్క కశ్మీర్‌ను పాకిస్తాన్‌ను అప్పగించాలని అనుకుంటున్నారా?” అని ప్రశ్న అడిగారు. దీనికి రెండు సమాధానాలు ఇచ్చారు.
ఒకటి ”అవును.. దీని వల్ల భారత్‌కు డబ్బు ఆదా అవుతుంది” అని, రెండవది ”ఒద్దు.. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మరింత కావాలని అడుగుతారు” అని. ఈ రెండు సమాధానాలకు ఏ. మొదటిది బలంగా ఉంది, బీ. రెండవది బలంగా ఉంది, సీ. పై రెండూ బలంగా ఉన్నాయి, డీ. పై రెండూ బలంగా లేవు అని నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గైడ్‌లైన్స్‌ను పాటించకుండా ఇలాంటి ప్రశ్నలు తయారు చేయడం పట్ల సంబంధిత వ్యక్తికి ఉన్నతాధికారులు షోకాజు నోటీసులు పంపించారు. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్‌కే చెందిన రాష్ట్ర బోర్డులో 2020 మార్చిలో నిర్వహించిన 10వ పరీక్షలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ను ‘ఆజాద్ కశ్మీర్’ అంటూ ప్రస్తావించారు.