News

ఎంపీలు మతపరమైన విద్వేష వ్యాఖ్యలు చేయొద్దు: స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా

321views

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం ముందు అన్ని మతాలు ఒక్కటేనన్న విషయాన్ని ప్రతి పార్లమెంట్‌ సభ్యుడు గుర్తుంచుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఉద్ఘాటించారు. ఏ మతంవారినైనా రెచ్చగొట్టే ప్రకటనలను చేయవద్దన్న ఆయన అన్నివేళలా పార్లమెంట్‌ గౌరవ, మర్యాదలను కాపాడుకోవాలని స్పష్టం చేశారు. లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించి మూడేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా స్పీక‌ర్ మాట్లాడారు. తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు సహకరిస్తున్న అన్ని రాజకీయ పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రస్తుతం సభా కార్యకలాపాలు 100శాతం సజావుగా సాగడం అతిపెద్ద విజయమని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పేర్కొన్నారు. 17వ లోక్‌సభ ఇప్పటివరకు ఎనిమిది సార్లు సభ సమావేశం కాగా.. దాదాపు వెయ్యి గంటలపాటు సమావేశాలు కొనసాగాయన్నారు. అయితే, పార్లమెంటులో మాట్లాడేటప్పుడు అనవసరంగా ఆవేశానికి గురికావడం, అరవడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సభ్యులకు సూచించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి