News

సంక్షోభంలో శివసేన ప్రభుత్వం… 22 మంది ఎమ్యెల్యేలు వేరే కుంపటి!

369views

ముంబై; మహారాష్ట్రలో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. మహారాష్ట్ర మంత్రి, శివసేన అసంతృప్త నేత ఏక్‌నాథ్ షిండే తనతో పాటు 22 మంది మొత్తం 12 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని గుజరాత్‌కు మకాం మార్చారు. సూరత్‌ నగరంలోని ఓ హోటల్‌లో క్యాంప్ ఏర్పాటు చేశారు. ఏక్‌నాథ్ షిండేతోపాటు మిగతా ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్లు కలవడంలేదని సమాచారం.

దీంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో అలజడి మొదలైంది. ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే కొంతకాలంగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉంటున్నారు. పార్టీ అధిష్ఠానం తనను పట్టించుకోవడం లేదని, పక్కనపెడుతున్నారని షిండే భావిస్తున్నట్టు కథ‌నాలు వెలువడుతున్నాయి. ఆయనతోపాటు పల్ఘర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ వంగా, అలీగర్ ఎమ్మెల్యే మహేంద్ర డల్వీ, భివండి రూరల్ ఎమ్మెల్యే శాంతారామ్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేల ఫోన్లు ‘అన్‌రీచ్‌బుల్’ అని వస్తున్నాయి. ఈ పరిణామంపై ఎన్‌సీపీ ప్రతినిధి మహేష్ తపసే మాట్లాడుతూ మహాకూటమి ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని, ఖచ్చితంగా భద్రంగా ఉందని భరోసా వ్యక్తం చేశారు. కాగా ప్రతిపక్ష బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం.. శివసేనకు చెందిన 12 ఎమ్మెల్యేలతోపాటు 5 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెబుతున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి