News

గల్వాన్ అమరవీరులకు రాజ్‌నాథ్ నివాళి

398views

న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో రెండేళ్ళ కింద‌ట చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవాన్లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం నివాళులర్పించారు. 2020 జూన్ 15-16 తేదీల్లో తమ దేశ గౌరవాన్ని కాపాడేందుకు వీరోచిత పోరాటం చేసి అమరులైన గల్వాన్ అమరవీరులకు స్మరించుకుంటూ వారి ధైర్య పరాక్రమాలను, దేశం కోసం వారు చేసిన ప్రాణత్యాగాన్ని ఎన్నటికీ మరువలేమని పేర్కొంటూ రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఆయన జమ్మూ కశ్మీరులో పర్యటనలో ఉన్నారు. గల్వాన్ లోయలో చైనా సైనికులతో ఘర్షణలు చెలరేగి 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ పరిణామంతో తూర్పు లడఖ్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడి ఇప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి