
485views
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు బార్డర్ సెక్యూరిటీ బలగాలు. అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. నార్త్ 24 పరగణాల జిల్లాలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 11 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్‌లోని బెనాపోల్ నుంచి భారత్‌కు తిరిగివస్తున్న ట్రక్కును తనిఖీ చేయగా బంగారం లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. బంగారం విలువ సుమారు ఆరు కోట్లు ఉంటుందని తెలిపారు.

Source: V6 Velugu





