News

వివాహ బంధంలోకి ఒకేసారి 12వేల జంటలు, వధువులకు యోగి ప్రభుత్వం నజరానా!

521views

లక్నో: ఉత్తర్​ప్రదేశ్‌లో జరిగిన సామూహిక వివాహ వేడుకల్లో శుక్రవారం వేలాది జంటలు ఒక్కటయ్యాయి. రాష్ట్రంలోని 60 జిల్లాల్లో జరిగిన ఈ సామూహిక పెళ్ళిళ్ళ ద్వారా 12 వేల జంటలు వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. మతాలకు అతీతంగా జరిగిన ఈ పరిణయాల సందర్భంగా యోగి ఆదిత్యనాథ్​ ప్రభుత్వం.. ఒక్కో వధువు ఖాతాలో రూ.35 వేల చొప్పున జమ చేసింది.

లఖ్​నవూలో జరిగిన సామూహిక వివాహ వేడుకలో ఆ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అసిం అరుణ్ పాల్గొన్నారు. రెండో విడత సామూహిక వివాహాలు ఈ నెల 17న నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. పేద కుటుంబాలకు చేయూత ఇవ్వడంతోపాటు వరకట్న దురాచారానికి అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం.. ఈ సామూహిక వివాహ కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. సంభాల్ జిల్లాలో అత్యధికంగా 419 జంటలు ఒక్కటయ్యాయని పేర్కొన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి