News

కరోనాపై కేంద్రం హెచ్చరిక

535views

దేశంలో మరోసారి కరోనా అలజడి మొదలైంది. గత కొన్ని నెలలుగా పెద్దగా కనిపించని కరోనా పాజిటివ్ మళ్ళీ పెరుగుతూ ఉన్నాయ్. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,240 క్రొత్త కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. దాంతో పెరుగుతున్న కరోనా కేసులపై రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రజలను కేంద్రం హెచ్చరించింది. . పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటకలలో కోవిడ్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించింది. కరోనా వ్యాప్తి కట్టడికి ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాలని రాష్ట్రాలకు సూచించింది. “టెస్ట్- ట్రాక్ – ట్రీట్ – వ్యాక్సిన్” ప్రక్రియను వేగవంతం చెయ్యాలని తెలిపింది. కోవిడ్ నిబంధనలు ప్రజలు పాటించేలా చూడాలంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.