News

పాక్ లో హిందూ దేవాలయంపై దాడి

549views

అంతర్జాతీయంగా ఎన్ని అభ్యంతరాలు, వ్యతిరేకత, నిరసనలు, విమర్శలు వ్యక్తమవుతున్నా పాకిస్థాన్ లోని ముస్లిముల తీరు మాత్రం మారటం లేదు. అక్కడ మైనారిటీ హిందువులపై దాడులు నిత్య కృత్యమన్న విషయం మరోసారి ఋజువైంది.

పాకిస్థాన్లో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. కరాచీలోని శ్రీ మరీ మాతా మందిర్ పై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసి పరారయ్యారు. ప్రత్యక్ష సాక్షి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పాక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ దేశంలో నిత్యమూ హిందువులపై దాడులు, దేవాలయాల విధ్వంసం జరుగుతున్నా ఏనాడు దానిపై నోరు మెదపని పాకిస్థాన్ ఇటీవల బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై నిస్సిగ్గుగా భారత రాయబార కార్యాలయానికి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.