
479views
బోరు బావుల్లో పిల్లలు పడటం వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేయడం చూస్తూనే ఉన్నాం. బోరు బావులకు దూరంగా పిల్లలను ఉంచాలని అవగాహన కల్పిస్తున్నా పరిస్థితులు మారడం లేదు. గుజరాత్ లోని ధృంగధ్ర వద్ద 18 నెలల చిన్నారి ప్రమాద వశాత్తు బోరు బావిలో పడిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకుని ఇండియన్ ఆర్మీ సైనికులు వెంటనే రంగంలోకి దిగారు. చిన్నారికి ఎలాంటి గాయాలూ కాకుండా తాడు సాయంతో చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. భారత సైనికులు సమర్థవంతంగా నిర్వహించిన ఈ రెస్క్యూ ఆపరేషన్ కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. “దటీజ్ అవర్ ఇండియన్ ఆర్మీ” అంటూ సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయ్. సైనికులు చిన్నారిని రక్షిస్తున్న, వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ కొందరు “భారత్ మాతాకే జై” అని నినదిస్తున్నారు.





