News

భార‌త్‌లో ఆత్మాహుతి దాడులు చేస్తాం: అల్ ఖైదా హెచ్చరిక

210views

న్యూఢిల్లీ: మహమ్మద్‌ ప్రవక్తను అవమానించిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని అంతర్జాతీయ ఉగ్రసంస్థ అల్‌ఖైదా ప్రకటించింది. భారత్‌లోని దిల్లీ, ముంబయి నగరాలతో పాటు, ఉత్తర‌ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలలో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని హెచ్చరించింది.

మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను సైతం హతమారుస్తామని ఆరో తేదీతో వెలువడిన లేఖలో ఉగ్రసంస్థ పేర్కొంది. ప్రవక్త గౌరవం కోసం పోరాడతామన్న అల్‌ఖైదా… శరీరాలకు పేలుడు పదార్థాలను బిగించిన ఆత్మాహుతి దళాలను రంగంలోకి దించుతామంది. తమ పిల్లలను సైతం ఇందుకు వినియోగిస్తామని పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి