
402views
-
భారతీయులకు ఎంతో విలువ ఇస్తామని వెల్లడి
వాషింగ్టిన్: అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు గతేడాదిని మించి ఈ ఏడాది భారీ స్థాయిలో విద్యార్థుల వీసాలను జారీ చేయనున్నట్టు దిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారిని పాట్రిసియా లసినా తెలిపారు. కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ 2021 వేసవిలో రికార్డు స్థాయిలో సుమారు 62 వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేశామని, ప్రస్తుత ప్రవేశాల కోసం లక్ష దరఖాస్తులను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎంబసీలో మంగళవారం నిర్వహించిన 6వ విద్యార్థి వీసాల దినోత్సవంలో ఆమె ఈ మేరకు మాట్లాడారు.





