News

ఈడీ సోదాల్లో ఆప్ మంత్రి ఇంట్లో భారీగా బంగారం, నగదు

414views
  • అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఆప్ అగ్రనాయకులందరినీ విచారించాలని భాజపా, కాంగ్రెస్ డిమాండ్

న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌తో పాటు ఆయన సన్నిహితుల నివాసాల్లో జరిగిన సోదాల్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వెల్లడించింది. సత్యేంద్ర జైన్‌ ఇంట్లో 2.82 కోట్ల రూపాయల నగదు, 1.80 కిలోల బరువున్న 133 బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. ఇతర పత్రాలను, డిజిటల్​ రికార్డులను సీజ్​ చేసినట్లు చెప్పింది. విచారణ కొనసాగుతోందని ఈడీ వివరించింది. ఈడీ సోదాలపై అరవింద్​ కేజ్రీవాల్​ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు కౌంటర్​ ఇచ్చాయి.

రానున్న రోజుల్లో మరిన్ని పేర్లు బయటకు వస్తాయని ఆరోపించాయి. ఈ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ను కూడా విచారించాలని భాజపా డిమాండ్​ చేసింది. ఈ కేసుతో ఆయనకు కూడా సంబంధం ఉందని.. అందుకే జైన్​కు క్లీన్​చిట్​ ఇచ్చారని ఆరోపించింది. ఈ కేసులో మరిన్ని పేర్లు బయటకు వస్తాయని.. తర్వాత విచారణ ఎదుర్కొనేది మనీశ్​ సిసోడియా అని కాంగ్రెస్ విమర్శించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి