News

కరెన్సీ నోట్లపై ఠాగూర్, కలాం చిత్రాలు?

441views

న్యూఢిల్లీ: కరెన్సీ నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం చిత్రాలను ముద్రించే అంశాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు పరిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కరెన్సీ నోట్లపై గాంధీ చిత్రం మాత్రమే ఉంటోంది. తొలిసారి ఇతరుల చిత్రాలను కూడా కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఆర్​బీఐ ఆలోచిస్తున్నట్టు స‌మాచారం. 2017లోనే ఈ ప్రతిపాదన వచ్చినా ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఈ విషయమై త్వరలోనే ఒక నిర్ణయానికి రావాలని ఆర్​బీఐ భావిస్తున్నట్టు సమాచారం.

ఈ మేరకు కొత్త వాటర్‌మార్కులు ఉన్న నోట్లను ఐఐటీ ఢిల్లీ గౌరవ ప్రొఫెసర్ దిలీప్ టి.షాహనీకి పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయనే గాంధీ, ఠాగూర్, కలాం చిత్రాల్లో ఒకదాన్ని ఎంపిక చేస్తారట! ఆయన సెలెక్ట్ చేసిన నోటును ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నట్టు సమాచారం. లేదంటే మూడింటినీ పంపుతారు. అయితే, వాటిలో దేన్ని ముద్రించాలనే నిర్ణయం అత్యున్నత స్థాయిలో తీసుకుంటారని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి