News

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన తెలుగమ్మాయి జ్యోతిక

579views

అమ‌రావ‌తి: తెలుగమ్మాయి దండి జ్యోతిక శ్రీ(ఆంధ్రప్రదేశ్​) 400 మీటర్ల వ్యక్తిగత పరుగు విభాగంలో అద్భుతాలు సృష్టిస్తోంది. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 18 పతకాలతో సత్తా చాటిన ఆమె.. తాజాగా అంతర్జాతీయ స్ప్రింట్​, రిలే కప్​ అథ్లెటిక్స్​ పోటీల్లోనూ మెరిసింది. తుర్కియా(ట‌ర్కీ)వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో స్వర్ణ పతకంతో సత్తాచాటింది. మహిళల 400 మీటర్ల పరుగును ఆమె 53.47 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచింది.

గతేడాది జాతీయ అండర్‌-23 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 400 మీటర్ల పరుగును 53.05 సెకన్లలో ముగించి స్వర్ణంతో మెరిసింది. అలానే అదే ఏడాది ఫెడరేషన్‌ కప్‌ (53.57 సె), జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ (53.79 సె), అంతర్రాష్ట్ర టోర్నీ (53.29 సె) మెరుగైన ప్రదర్శనతో ముగించింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి