
490views
-
రోజుకు వెయ్యి మందికి రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు
తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్ళే ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. తెలంగాణ నుంచి రోజుకు వెయ్యి మందికి రూ.300 దర్శన టికెట్లు జారీ చేయనున్నట్టు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టికెట్లు జారీ చేసేందుకు టీటీడీ ఛైర్మన్ అంగీకరించారన్నారు. ఈ దర్శన టికెట్లు పొందాలనుకున్న వారు ప్రయాణానికి రెండు రోజుల ముందు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్టు రిజర్వు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.




