294
కాబూల్: ఉగ్రవాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశాల్లో అఫ్గాన్ ఒకటి. ఆ దేశంలో కొంత కాలంగా బలహీనపడుతూ వస్తున్న అల్-ఖైదా ఉగ్రవాద సంస్థ ఏక్యూఐఎస్.. మళ్లీ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఐరాస తన నివేదికలో తెలిపింది. అందులో భాగంగానే తన మ్యాగజైన్- 2020 పేరును ‘నవా-ఇ-అఫ్గాన్- జిహాద్’ నుంచి ‘నవా-ఎ-గజ్వా-ఇ-హింద్’గా మార్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అఫ్గాన్ నుంచి కశ్మీర్ వరకు తిరిగి దృష్టి పెట్టాలని ఆ పేరు సూచిస్తున్నట్టుగా ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. గత ఏడాది ఆగస్టులో అఫ్గానిస్థాన్ అధికారాన్ని తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత మళ్లీ వాటి దాడులు పెరుగుతున్నట్లు ఐరాస అభిప్రాయపడింది.