News

త్వరలోనే మధుర, బృందావనం తదితర క్షేత్రాలు మేల్కోంటాయి…

597views
  • యోగి ఆదిత్యనాథ్

ల‌క్నో: కాశీలోని జ్ఞానవాపి మసీదులో హిందూ దేవతల విషయంలో వివాదం కొనసాగుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత కాశీ నగరం మేల్కొన్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

మథుర, బృందావనం, విద్యావాసినీ ధామ్, నైమిశ్ ధామ్ దేవస్థాన యాజమాన్యాలు సైతం మేల్కొంటున్నాయని చెప్పుకొచ్చారు. లఖ్​నవూలో బీజేపీ నిర్వహించిన ఒకరోజు రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశంలో మాట్లాడిన యోగి.. యూపీలో మతపరమైన అల్లర్లు జరగలేదని చెప్పారు.

“రామనవమి, హనుమాన్ జయంతి వేడుకలు శాంతియుతంగా జరిగాయి. మొదటిసారి రంజాన్‌ సందర్భంగా చివరి శుక్రవారం రోడ్లపై నమాజు జరగలేదు. అనవసర శబ్దం నుంచి ఎలా విముక్తి కల్పించామో (మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు తొలగించడంపై) మీరు గమనించాలి.

కాశీ విశ్వనాథ్ మందిర కారిడార్​ను ప్రారంభించుకున్నాం. లక్ష మంది భక్తులు ఒకేసారి దర్శించుకునే అవకాశం ఇప్పుడు లభించింది. రామ మందిర నిర్మాణం తర్వాత కాశీ నగరం మేల్కొంటోంది. మథుర, బృందావనం వంటి తీర్థక్షేత్రాలు మేల్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మనమంతా మరోసారి ముందడుగు వేయాలి.” అని యోగి తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి