
539views
* విమానంలో నలుగురు భారతీయులు
నేపాల్‌లో ఓ విమానం ఆచూకీ గల్లంతైంది. ప్రైవేట్ ఎయిర్‌లైన్‌కు చెందిన తారా ఎయిర్9 విమానం ఆదివారం పఖోరా నుంచి జోమ్‌సమ్‌కు వెళ్తున్న సమయంలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. రెండు ఇంజిన్లు కలిగిన ఈ విమానంలో మొత్తం 22 మంది ఉండగా.. వీరిలో నలుగురు భారతీయులని సమాచారం. జెమ్‌సమ్ ప్రాంతంలోని ముస్తాంగ్ జిల్లాలోని గగనతలంలో చివరగా విమానం కనిపించిందని.. ఆ తర్వాత విమానంతో సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు. విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.





