News

‘క్వాడ్​ దేశాధినేతలకు ఈ సదస్సు గొప్ప అవకాశం’

407views

న్యూఢిల్లీ: జపాన్​లో ఈనెల 24న జరగనున్న క్వాడ్​ దేశాధినేతల సమావేశంలో పాల్గొననున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందులో భాగంగా జపాన్​ పర్యటనకు బయలుదేరే ముందు క్వాడ్​ సదస్సుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ గ్రూప్​ మొదలుపెట్టిన పలు పనుల పురోగతిని సమీక్షించటం, ఇండో- ఫసిఫిక్​ ప్రాంత అభివృద్ధి, అంతర్జాతీయ అంశాలపై ఆలోచనలు పంచుకునేందుకు ఈ సమావేశం గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. మే 23-24 మధ్య రెండు రోజుల పాటు జపాన్​లో పర్యటించనున్నారు భారత ప్రధాని.

“ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నాను. బహుముఖ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ప్రాంతీయ అభివృద్ధి, అంతర్జాతీయ సవాళ్లపై చర్చించనున్నాం. జపాన్​ ప్రధాని ఫుమియో కిషిదా ఆహ్వానం మేరకు టోక్యో వెళ్తున్నాను. టోక్యో పర్యటన సందర్భంగా.. భారత్​- జపాన్​ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్చలు చేపడతాం. ఆ తర్వాత జపాన్​లో జరగనున్న క్వాడ్​ దేశాధినేతల సమావేశంలో పాల్గొంటాను. ఈ గ్రూప్​ మొదలుపెట్టిన పనుల పురోగతిని సమీక్షించేందుకు నాలుగు దేశాల నేతలకు ఈ సదస్సు గొప్ప అవకాశం. అలాగే.. ఇండో-ఫసిపిక్​ ప్రాంత అభివృద్ధి, అంతర్జాతీయ అంశాలపై మా ఆలోచనలను పంచుకోనున్నాం.”

– నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి