News

భారీగా తగ్గిన పెట్రో, డీజిల్ ధరలు.. మోదీ ట్వీట్

472views

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. లీటర్ పెట్రోల్‌‌పై రూ.8, డీజిల్‌‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ఈ మేరకు మంత్రి నిర్మలా సీతారామన్ వరుస ట్వీట్లు చేశారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ప్రజల ప్రయోజనాలే తమకు తొలి ప్రాధాన్యమని ట్వీట్ చేశారు. తీసుకున్న నిర్ణయంతో పలు రంగాలకు సానుకూల ప్రభావం లభించనుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

దేశ ప్రజలకు ఊరట లభించనుందని, వారి జీవితాలను మరింత సులభతరం చేసే విధంగా ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు.ఎల్లప్పుడూ ప్రజలే తమ తొలి ప్రాధాన్యత అని పేర్కొంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌కుపెట్రో ధరల తగ్గింపు మరింత ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ట్వీట్ ను ఆయన జత చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి