News

‘స్వదేశీ యుద్ధ నౌక’లను జాతికి అంకితం చేసిన రాజ్‌నాథ్‌ సింగ్

489views

ముంబై: ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలు సూరత్, ఉదయగిరిలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. ముంబైలోని మాజగావ్‌ డాక్స్‌లో అవి జలప్రవేశం చేశాయి.

ఈ యుద్ధ నౌకల డిజైన్‌ను డైరెక్టరేట్‌ ఆఫ్‌ నేవల్‌ డిజైన్‌ (డీఎన్‌డీ) రూపొందించింది. నౌకలు, జలాంతర్గాముల తయారు చేసే ముంబైకి చెందిన రక్షణ రంగ అనుబంధం సంస్థ మాజగావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) వాటిని తయారు చేసింది. దేశీయంగా తయారు చేసిన రెండు యుద్ధ నౌకలను ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారని సంస్థ వెల్లడించింది.

వీటి రాకతో నావికాదళం మరింత బలోపేతమైందని ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ అన్నారు. దేశీయ అవసరాలను తీర్చుకోవడమే గాక మున్ముందు ఇతర దేశాల కోసం యుద్ధనౌకలు తయారు చేసే స్థాయికి భారత్‌ ఎదుగుతుందని ధీమా వెలిబుచ్చారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో విక్రాంత్‌ యుద్ధ విమాన తయారీ ఒక మైలు రాయి అయితే,ఇసూరత్, ఉదయగిరిల తయారీతో మన రక్షణ సామర్థ్యం హిందూ మహా సముద్రం నుంచి ఫసిఫిక్, అట్లాంటిక్‌ దాకా విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి