News

జ్ఞాన్‌వాపి మసీదుపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

750views

భాగ్య‌న‌గ‌రం: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ జ్ఞానవాపి మసీదుపై తీర్పును ప్రార్థనా స్థలాల చట్టం 1991 ఉల్లంఘనగా అభివర్ణించారు. చట్టం ప్రకారం ఏ వ్యక్తి ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాన్ని వేరే మతపరమైన ప్రార్థనా స్థలంగా మార్చకూడదు అని అన్నారు.

కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞాన్‌వాపి మసీదులో సర్వే కొనసాగుతుందని, మే 17లోగా నివేదిక సమర్పించాలని వారణాసి కోర్టు గురువారం మధ్యాహ్నం చెప్పడంతో ఒవైసి ఈ వ్యాఖ్యలు చేశారు. వారణాసి కోర్టు సర్వే కమిషన్‌లో కొత్తగా ఇంకో ఇద్దరు న్యాయవాదులను కూడా చేర్చింది.

బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కూడా కోర్టు ఉల్లంఘించిందని అని ఆయన అన్నారు. బాబ్రీ మసీదు తర్వాత మరో మసీదును కోల్పోవాలని తాను కోరుకోవడం లేదని ఒవైసీ స్పష్టం చేశారు. ఇది కఠోరమైన ఉల్లంఘనన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, అలాగే మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళతాయని తాను ఆశిస్తున్నానన్నారు. తాను ఒక బాబ్రీ మసీదును కోల్పోయాను.. మరొక మసీదును కోల్పోవాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి