News

పంజాబ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ హస్తం

43views

న్యూఢిల్లీ: పంజాబ్‌లోని మొహాలీలో సోమవారం జరిగిన రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్‌.పి.జి) దాడి కేసులో పోలీసులు శుక్రవారం ఆరుగురిని అరెస్టు చేశారు. పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై జరిగిన ఈ దాడి వెనుక పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ హస్తం ఉన్నట్టు వెల్లడైంది.

ఐఎస్ఐ ఆదేశాలతో ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ), స్థానిక గ్యాంగ్‌స్టర్స్ ఈ దాడికి పాల్పడినట్టు బయటపడింది. పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వీకే భవ్రా విలేఖ‌ర్ల సమావేశంలో మాట్లాడుతూ, కెనడా నివాసి లక్బిర్ సింగ్ లండా ఈ దాడికి ప్రధాన సూత్రధారి అని తెలిపారు. పాకిస్తాన్‌లోని ఖలిస్థాన్ ఉగ్రవాది హర్వీందర్ సింగ్ రిండాకు లక్బిర్‌ సన్నిహిత సహచరుడని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి