News

విద్యార్థుల‌కు ‘శార‌దా’ వింత ప్ర‌శ్న!

521views

ఉత్తరప్రదేశ్‌: ఫాసిజం/నాజీయిజం, హిందుత్వ మధ్య సారూప్యతలను రాయమని శారదా విశ్వవిద్యాలయం విద్యార్థులను కోరింది. ఉదాహరణల ద్వారా సారూప్యతలను రాయాల‌ని కోరింది.ఈ ప్రశ్నపత్రం స్క్రీన్‌షాట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రావడంతో వివాదం చెలరేగింది.

ఇటీవల, ఇస్లాంవాదులు, వామపక్షాలు హిందూయిజం, హిందుత్వం వేర్వేరు అని, హిందుత్వ అనేది హింసాత్మక భావజాలం అని ప్రచారం చేయడం ద్వారా హిందూ మతాన్ని కించపరిచే ప్రచారాన్ని నడుపుతున్నారు.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ (లోక్‌సభ) రాహుల్ గాంధీ హిందుత్వను హింసతో బహిరంగంగా పోల్చ‌డంతో నెలల తరబడి హిందుత్వపై దుష్ప్రచారం జ‌రుగుతోంది. హిందుత్వ అనేది హింసాత్మక భావజాలం అని రాహుల్ గాంధీ పబ్లిక్ ఫంక్షన్లలోని వేదికల నుండి ఊద‌ర‌గొడుతున్నారు.

గత ఏడాది అక్టోబర్‌లో ఢిల్లీలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) స‌ర్ కార్య‌వాహ ద‌త్తాత్రేయ హోసబాలే హిందుత్వం సర్వసమానమైనదని, లెఫ్ట్ రైట్ కాదని అన్నారు.

“ప్రపంచం ఎడమవైపున‌కు వెళ్ళింది, లేదా ఎడమవైపు వెళ్ళవలసి వచ్చింది, ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ప్రపంచం కుడి వైపున‌కు కదులుతోంది, తద్వారా అది మధ్యలో ఉంది. హిందుత్వం అంటే ఇదే, ఇది లెఫ్ట్ లేదా రైట్ కాదు, ”అని హోసబాలే అన్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి