News

ఒడిశాలో వైభ‌వంగా ప‌రశురామ జ‌యంతి ఉత్స‌వం

619views

గజపతి: ఒడిశాలోని గజపతి జిల్లా, రాయగడ బ్లాక్‌లోని పురాణ శైవపీఠం, పవిత్ర మహేంద్రగిరి కేంద్రంగా ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సప్త కులచల పరశురామ ధామంలో పరశురామ జ‌యంతి ఉత్స‌వాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.

పురాణాలు, చరిత్ర ప్రకారం.. త్రేతా, ద్వాపర, కలియుగంలోని పురుషులు, మహాపురుషులు, అన్ని యుగాల పురుషులు, మహాపురుషులతో సహా అనేక మంది సాధువులు వెళ్ళి బోధించగా, శాశ్వత తపస్వి అయిన పరశురాముడు పవిత్ర మహేంద్రగిరి శిఖరాన్ని అధిరోహించాడు. దీంతో ఇక్క‌డి గ‌ల మహేంద్ర ఆశ్రమానికి చెందిన భ‌క్తులు మహేంద్రగిరి శిఖరం వద్ద ఉన్న పరశురాముని పీఠంలో పరశురామ జయంతిని జరుపుకొన్నారు.

మహేంద్రగిరికి చెందిన సన్యాసి దండిస్వామి వస్కరతీర్థ విశేష యజ్ఞములు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సన్యాసి దండిబాబా మహేంద్ర సాధక్ ప్రఫుల్ల బాబా, ఆచార్య, సన్యాసి ప్రముఖ్ అధ్యక్షత వహించారు. ఉత్స‌వంలో ప్రధానంగా లోకంలో శాంతి కోసం, ప్రతి జంతువు సంక్షేమం కోసం పూజలు, యాగాలు, సామూహిక ప్రార్థ‌నలు జరిగాయి.

Source: Odisha News Online

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి