
రాజస్తాన్: రంజాన్ పర్వదిన వేళ రాజస్తాన్‌లో అల్లర్లు చెలరేగాయి. జోధ్‌పూర్‌లో రెండు వర్గాల మధ్య సోమవారం రాత్రి ఘర్షణ తలెత్తింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు కట్టదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్‌ను బంద్ చేసి.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు.
జోద్‌పూర్‌లోని జలోరి గేట్ కూడలి వద్ద రెండు వర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. పరశురామ్ జయంతి పండుగ నేపథ్యంలో మూడు రోజుల ఉత్సవాలు జోధ్ పూర్ లో జరుగుతున్నాయి. పరశురామ్ జయంతి, రంజాన్ రెండు పండుగల నేపథ్యంలో ఇరు మతస్థులు వారివారి మతపరమైన జెండాలను ఎగురవేశారు.
ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య వాదన ప్రారంభమై, చివరకు ఘర్షణకు దారి తీసింది. రెండు వర్గాలు రాళ్ళు రువ్వుకున్నాయి. ఈ నేపథ్యంలో జనాలను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఇదే సమయంలో పోలీసులపై కూడా కొందరు రాళ్ళు రువ్వారు.
Source: Nijamtoday





