
న్యూఢిల్లీ: యుక్రెయిన్ – రష్యా యుద్ధంలో ఎవరూ విజేతలుగా అవతరించలేరని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ శాంతికి మద్దతిస్తుందని తెలుపుతూ యుద్ధానికి ముగింపు పలకాలని ఇరుదేశాలనూ ఆయన కోరారు. యుద్ధం వల్ల ప్రతి ఒక్కరు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన యుద్ధం గురించి స్పందిస్తూ ఉక్రెయిన్‌లో హృదయవిదారక దృశ్యాలే కాకుండా ఆయిల్ ధరలు పెరిగాయని, గ్లోబల్ ఫుడ్ సప్లయి చెయిన్‌పై కూడా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఈ పరిణామాలు ప్రపంచ కుటుంబంపై భారంగా మారతాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.
బెర్లిన్‌లో జర్మనీ ఛాన్సలర్ ఒలాప్ స్కోల్జ్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న మోదీ.. ఉక్రెయిన్-రష్యా సంక్షోభం కారణంగా వస్తువుల ధరలు పెరిగాయని తెలిపారు. శాంతియుత చర్చలే ముందున్న ఏకైక మార్గమమని మరోసారి పేర్కొన్నారు.
యుద్ధం ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపై కూడా చూపుతోందన్న మోదీ.. యుద్ధంతో ఏర్పడిన మానవతావాద పరిణామాల గురించి భారత్ ఆందోళన చెందుతోందని మోదీ అన్నారు.
Source: Nijamtoday





