News

ఈద్ రోజున భద్రతా బలగాలపై రాళ్ళు!

514views

జ‌మ్మూక‌శ్మీర్‌: ఈద్ సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలపై దుండగులు రాళ్ళు రువ్వారు. మసీదులో ఈద్ సందర్భంగా తెల్లవారుజామున ప్రార్థనలు చేసిన తర్వాత, దుండగులు ‘క‌శ్మీర్‌కు స్వేచ్ఛనివ్వండి’ అంటూ నినాదాలు చేశారు.

మసీదు వెలుపల ఉన్న బలగాలు పరిస్థితిని శాంతింపజేసేందుకు ప్రయత్నించగా, దుండగులు బలగాలపై రాళ్ళు రువ్వడం ప్రారంభించారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఇది చిన్న ఘటనేనని, ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశామని పోలీసులు తెలిపారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి