News

క్రీడల్లో కొత్తగా అందుబాటులోకి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్

498views

న్యూఢిల్లీ: భారతదేశంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫిఫా ప్లస్ (FIFA+) కోసం స్పోర్ట్స్ డాక్యుమెంటరీ ‘మైతానం’ ను ప్రారంభించినట్టు ఫిఫా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చిన ఎంపిక చేసిన ఫిపా ప్లస్ ఒరిజినల్స్‌లో భాగంగా ‘మైతానం’ గ్లోబల్ స్పోర్ట్స్ స్టోరీ టెల్లింగ్ కంటెంట్ ఎలైట్ లిస్ట్‌లో చేరింది.

‘కేరళలోని ఫుట్‌బాల్‌కు 40 నిమిషాల ప్రేమలేఖ’ ట్యాగ్‌లైన్‌తో తీసుకొచ్చిన ‘మైతానం’లో తమ జీవితంలో ఫుట్‌బాల్‌ను భాగంగా మార్చేసుకున్న కేరళకు చెందిన ఆరు స్ఫూర్తిదాయక కథలు ఉన్నాయి.

ఇప్పుడీ డాక్యుమెంటరీ FIFA+లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది. ‘మైతానం’ అనేది మలయళ పదం. మైదానం అని అర్థం. కేరళీయుల అభిరుచికి, ఫుట్‌బాల్ పట్ల మలయాళీలకు ఉన్న ఇష్టానికి ఇది అద్దం పడుతోంది.

అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ఇప్పుడిది ప్రయత్నిస్తోంది. కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి వాణిజ్య రాజధాని కొచ్చి, సాంస్కృతిక రాజధాని త్రిసూర్ వరకు విభిన్న భూభాగాలను ఈ డాక్యుమెంటరీ కవర్ చేస్తుంది, చెప్పులు లేకుండా ఆడే పూజారులను కలవడం, విదేశాల్లో జరిగే పోటీల్లో మహిళా జట్టు అలరిస్తున్న తీరు, 90 ఏళ్లు దాటిన వారి వద్ద చిన్నారులు శిక్షణ పొందుతుండడం వంటి వాటిని చూపించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి