
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనలో జాడ లేకుండా పోయారని వార్తలు వచ్చిన కొన్ని రోజుల తర్వాత, పొరుగు దేశమైన నేపాల్‌లో పబ్ పార్టీలో ప్రత్యక్షమయ్యారు. అదీకాకుండా, ఓ చైనా మహిళా దౌత్యవేత్తతో కలిసి కనిపించడంపై వివాదాస్పదమైంది.
ఫేస్‌బుక్ పోస్ట్‌లో, భూపేన్ కున్వర్ అనే నేపాలీ పౌరుడు, “భారత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇన్ ఎల్‌ఓడి (లార్డ్ ఆఫ్ ది డ్రింక్స్)” అని రాశారు. నేపాల్‌లోని ఖాట్మండు నగరంలో ఉన్న పబ్‌లో గాంధీ ఉనికిని చూపించే రెండు వీడియోలను అతను అప్‌లోడ్ చేశాడు.
ఒక వీడియోలో, కాంగ్రెస్ వారసుడు తన ఫోన్‌ను ఉపయోగిస్తుండగా, మరొక వీడియోలో అతను ఒక మహిళతో మాట్లాడుతున్నట్టు కనిపించాడు. రాహుల్ గాంధీ ఒక మహిళతో సంభాషించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఆ మహిళ నేపాల్‌లో చైనా రాయబారి హౌ యాంకీ అని కూడా కొందరు ఊహించారు.
Noiiice ? pic.twitter.com/jTvUyVuE7A
— Ajit Datta (@ajitdatta) May 3, 2022
సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్‌ను విడిచిపెట్టి విదేశాల్లో పార్టీలు చేసుకున్నందుకు రాహుల్ గాంధీపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం నేపాల్‌లోని ఖాట్మండులో ఉన్నట్టు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.
సిఎన్ఎన్ మాజీ కరస్పాండెంట్ అయిన తన స్నేహితురాలు సుమ్నిమా ఉదాస్ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన నేపాల్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. . ఆమె తండ్రి భూమ్ ఉదాస్ మయన్మార్‌లో నేపాలీ రాయబారిగా పనిచేశారు.
Couple of videos of charming & joyful Rahul Gandhi has set the social media on fire. The bottle infront of him is some kind of "Ras". Looks like he is spending his Eid in a bar. We are happy for him. pic.twitter.com/qL7L8PEaWZ
— Shailendra Singh (@shaksingh) May 3, 2022
మీడియా కథనాల ప్రకారం ప్రకారం, సుమ్నిమా ఉదాస్ నిమా మార్టిన్ షెర్పాను వివాహం మే 3న ఉండగా, మే 5వ తేదీన బౌద్ధాలోని హయత్ రీజెన్సీ హోటల్‌లో అధికారిక రిసెప్షన్ జరగనుంది. రాహుల్ గాంధీ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఖాట్మండు మారియట్ హోటల్‌లో బస చేశారు.
Source: Nijamtoday





