
న్యూఢిల్లీ: మార్చి నెలలో 18లక్షల భారతీయుల ఖాతాలను సామాజిక మాధ్యమం వాట్సాప్ నిషేధించింది. గ్రీవెన్స్ విభాగం ద్వారా వచ్చిన ఫిర్యాదులతో పాటుగా ఉల్లంఘనలను గుర్తించడానికి, నిరోధించడానికి ఏర్పాటు చేసుకున్న సొంత యంత్రాంగం ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 18.05 లక్షల ఖాతాలను నిషేధిస్తూ చర్యలు తీసుకుంది. ఈ మేరకు వాట్సాప్ నెలవారీ నివేదిక వెల్లడించింది.
ఫిబ్రవరిలోనూ 14.26 లక్షల భారతీయ ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. ఖాతాదారుల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని వాట్సాప్ అధికార ప్రతినిధి తెలిపారు. కృత్రిమ మేధ సహా ఇతర సాంకేతికతలు, డేటా సైంటిస్టులు, నిపుణులపై పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు.
గతేడాది నుంచి కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి వచ్చాాయి. దీని ప్రకారం 50లక్షలకుపైగా వినియోగదారులు ఉన్న ప్రతి సంస్థ.. ప్రతినెల ఫిర్యాదుల నివేదికను వెల్లడించాలి. ఇందులో భాగంగానే వాట్సాప్ ప్రతినెలా చర్యలు తీసుకుంటోంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





