News

ఐరోపాతో బంధం పటిష్ఠం చేసుకుంటాం: మోదీ

418views

న్యూఢిల్లీ: భారత్‌ శాంతి, శ్రేయస్సుకు ఐరోపా భాగస్వాముల సహకారం కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని.. ఈ రోజు నుంచి జర్మనీ, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌ దేశాలు సందర్శించనున్నారు.

ఆయా దేశాధినేతలతో సమావేశం కానున్నారు. ఐరోపా ప్రస్తుతం వివిధ సవాళ్లు, ప్రత్యామ్నాయాలు ఎదుర్కొంటోందని.. ఈ కీలక సమయంలో తాను ఈ ప్రాంతంలో పర్యటించనున్నానని మోదీ పేర్కొన్నారు.

భారత్‌ శాంతి, శ్రేయస్సు పథంలో ఐరోపా భాగస్వామ్యం చాలా కీలకమన్న ప్రధాని.. సహకార స్ఫూర్తితో ఈ ప్రాంతంలోని సహచరులతో తమ బంధాన్ని పటిష్ఠం చేసుకుంటామని తెలిపారు. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో ఐరోపా దేశాలు రష్యా వ్యతిరేకంగా సంఘటితమైన సంగతి తెలిసిందే. దీంతో పలు ఐరోపా దేశాలు ఇంధన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మోదీ పర్యటనలో ఈ సమస్యకే అధిక ప్రాధాన్యత ఉంటుందని భారత విదేశాంగ వర్గాలు పేర్కొన్నాయి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి