
542views
బెంగళూరు: కర్ణాటకలోని దొడ్డ పట్టణంలోని దర్జీపేటలో ఉన్న పాండురంగ విఠల దేవాలయంలో అర్ధరాత్రి ఆటోలో వచ్చిన నలుగురు దొంగలు దేవాలయం ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి లోపలకు చొరబడ్డారు.
పెద్ద హుండీని అతి కష్టంమీద పెకలించి బయటకు తీసుకువచ్చి ఆటోలో ఎత్తడానికి ప్రయత్నిస్తుండగా దేవాలయం ఎదురుగా ఉన్న ఇంట్లో వారు గట్టిగా కేకలు వేయడంతో హుండీ అక్కడే వదిలి ఆటోతో సహా పరారయ్యారు. చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
శివమొగ్గ: బసవనగంగూరు గ్రామంలోని గుళ్లమ్మ, మాతంగమ్మ దేవాలయాల్లో చోరీ జరిగింది. రాత్రి గుళ్లలో కి దొంగలు చొరబడి దేవతామూర్తులకు అలంకరించిన రూ.లక్షల విలువైన బంగారు నగలు, హుండీలోని కానుకలను ఎత్తుకెళ్ళారు.





