News

బీజేపీ ప్రభుత్వాల‌తోనే ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి: ప్రధాని మోదీ వెల్లడి

542views

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి కోసం చేపట్టిన అనేక చర్యలను వివరిస్తూ, ఇదంతా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఘనత అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అసొంలోని కర్బి అంగ్‌లాంగ్ జిల్లాలో వివిధ ఆరోగ్య సంరక్షణ, విద్యా సంబంధిత ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వాలు ఏర్పడటాన్ని డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అని ఆ పార్టీ పిలుస్తున్న సంగతి తెలిసిందే. కర్బి అంగ్‌లాంగ్‌లోని డిఫులో ‘శాంతి, ఐక్యత, అభివృద్ధి సభ’ పేరుతో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితులు మెరుగుపడినందు వల్ల సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్‌పీఏ) అమలును అసొంలోని 23 జిల్లాల్లో, ఈ ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాల్లో రద్దు చేసినట్టు తెలిపారు.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి నమ్మకం, అందరి కృషి’ స్ఫూర్తితో పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇదే స్ఫూర్తితో సరిహద్దుల సమస్యలు కూడా పరిష్కారమయ్యాయని చెప్పారు. ఇటీవల అసొం-మేఘాలయ మధ్య కుదిరిన ఒప్పందం ఇతరులను కూడా ప్రోత్సహిస్తుందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి