
న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో స్థానిక భాషల వాడకాన్ని ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇది న్యాయవ్యవస్థపై దేశంలోని సామాన్య పౌరులకు నమ్మకాన్ని పెంచుతుందని తెలిపారు.
ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల సీజేలు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో శనివారం ఆయన మాట్లాడుతూ 2015లో అసంబద్ధంగా మారిన సుమారు 1800 చట్టాలను తాము గుర్తించామని చెప్పారు. వీటిలో 1450 చట్టాలను కేంద్రం రద్దు చేయగా, రాష్ట్రాలు కేవలం 75 చట్టాలను మాత్రమే రద్దు చేశాయని ప్రధాని తెలిపారు.
న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు చేపడతామని తెలుపుతూ న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీకి చర్యలు తీసుకుంటామని ప్రధాని ప్రకటించారు. దేశం అమృత కాలంలో ఉందని పేర్కొంటూ ఈ సమయంలో ప్రతి ఒక్కరికీ సులభంగా, సత్వర న్యాయం అందించే న్యాయవ్యవస్థ కోసం మనమంతా ఆలోచన చేయాలని నరేంద్ర మోదీ సూచించారు.
Source: Nijamtoday





